గణేష్ నిమజ్జనంలో డీజే పెట్టారో అంతే సంగతి.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక

by Gantepaka Srikanth |

గణేష్ నిమజ్జనాల(Ganesh immersions) వేళ మండపాల నిర్వహకులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) కీలక ఆదేశాలు జారీ చేశారు.

గణేష్ నిమజ్జనంలో డీజే పెట్టారో అంతే సంగతి.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నిమజ్జనాల(Ganesh immersions) వేళ మండపాల నిర్వహకులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) కీలక ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనంలో డీజే, టపాసులు వాడొద్దు అని చెప్పారు. డీజేల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. నిమజ్జనం తర్వాత కొందరు చనిపోతున్నారని చెప్పారు. సౌండ్‌పై డయల్‌ 100కు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. గతేడాది కంటే వినాయక విగ్రహాలు ఎక్కువ ఎత్తు ఉన్నాయి. గణేష్‌ నిమజ్జనానికి అందరూ సహకరించాలి. నిబంధనలకు విరుద్ధంగా డీజీలు పెట్టినా, టపాసులు కాల్చినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరిలతో కలిసి నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. శోభాయాత్ర మార్గంలో కీలకమైన బాలాపూర్, చార్మినార్ సర్కిల్, మోజాంజాహి మార్కెట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ఊరేగింపు మార్గాలను పరిశీలించారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు ఆధారంగా పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు.

Next Story