- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో రైలు రవాణా సంస్థ బిగ్ అలర్ట్స్. ప్రయాణికుల భద్రతను ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ మెట్రో మరో నిబంధనను విధించింది. మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో, అలాగే మెట్రో రైలు పట్టాల సమీపంలో గాలి పటాలు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. గాలి పటాల దారాలు మెట్రో రైళ్లకు, ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైర్లకు చిక్కితే రైలు సేవలు నిలిచిపోవడమే కాకుండా, తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
గతంలో కూడా పతంగుల కారణంగా మెట్రో సేవల్లో చిన్నపాటి అంతరాయాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిషేధం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, యువత ఈ విషయాన్ని గమనించి మెట్రో నిబంధనలకు సహకరించాలని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కోరింది.






