- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచే సవరించిన ఛార్జీలు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ( Metro Passengers) బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి సవరించిన మెట్రో ఛార్జీలు (Metro harges) అ

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ( Metro Passengers) బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి సవరించిన మెట్రో ఛార్జీలు (Metro harges) అమల్లోకి రాబోతున్నాయి. ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచి.. మరోసారి సవరించింది మెట్రో యాజమాన్యం. దీంతో ఇవాల్టి నుంచి కొత్త చార్జీలు అమలులోకి రాబోతున్నాయి. సవరించిన మెట్రో ఛార్జీల ప్రకారం....కనిష్టంగా టికెట్ ధర 11 రూపాయలు ఉండనుంది. అదే సమయంలో గరిష్టంగా 69 రూపాయల టికెట్ నిర్ణయించింది మెట్రో యాజమాన్యం.
ఇక అంతకు ముందు కనిష్టంగా 12 రూపాయల టికెట్ ఉండేది. గరిష్టంగా 75 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మెట్రో యాజమాన్యం. అయితే ఒక్కసారిగా ధరలు పెరగడంతో... ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన మెట్రో యాజమాన్యం... మళ్లీ చార్జీలను సవరించింది.
ఈ నేపథ్యంలోనే పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. కొత్తగా సవరించిన చార్జీలు ఇవాల్టి నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన చేసింది. ఇక పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తూ మెట్రో యాజమాన్యం ( Metro Managment) నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులు కూడా కాస్త చల్ల బడ్డారు.






