ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో గుడ్‌న్యూస్! ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు

by Ramesh Naini |

మహిళా ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కలిసి ముందుకు అంటూ గురువారం ఎక్స్ వేదికగా @ltmhyd సంస్థ వివరాలు పోస్ట్ చేసింది.

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో గుడ్‌న్యూస్! ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా ప్రయాణికులకు (Hyderabad Metro) హైదరాబాద్‌ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కలిసి ముందుకు అంటూ గురువారం ఎక్స్ వేదికగా @ltmhyd సంస్థ (L&T Hyderabad Metro Rail) వివరాలు పోస్ట్ చేసింది. హైదరాబాద్‌ మెట్రో, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి సహకారంతో, ఈ వారం ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో ఉచిత బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ (Breast Cancer Screening), అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంపిక చేసిన స్టేషన్లలో స్టాల్ ఏర్పాటు చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్‌‌ను త్వరగా గుర్తించడం ద్వారా సమర్థవంతంగా పోరాడవచ్చు. మహిళలు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ట్వీట్ కోసం క్లిక్ చేయండి..

మెట్రో స్టేషన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి..

అమీర్‌పేట్ – అక్టోబర్ 23

ఎల్.బీ. నగర్ – అక్టోబర్ 24

హైటెక్ సిటీ – అక్టోబర్ 27

కేపీహెచ్‌బీ – అక్టోబర్ 28

ఎంజీబీఎస్ – అక్టోబర్ 29

Next Story