- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Weather Report: రానున్న వారం రోజులు ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో రాగల మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు కారణంగా కొన్ని ప్రాంతాలు ఊటీని తలపిస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా సూర్యరశ్మి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు చోట్ల ఉదయ వేళ్లలో సమీప దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. పొగమంచు ప్రభావం తెల్లవారుజామున 3 గంటల నుండి 8 గంటల వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 11.1 డిగ్రీలు సంగారెడ్డి జిల్లా కోహిర్ లో నమోదైనట్లు పేర్కొంది. అలాగే రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం కారణంగా ఈ నెల 8 వరకు ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుండి తేమ గాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తుందని పేర్కొంది. రాగల మూడు రోజులు ఉత్తర గాలులు ప్రారంభమై తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.






