Hyderabad: పోకిరీల వేటలో.. 'షీ టీమ్స్'

by Geesa Chandu |

సిటీలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీలపై హైదరాబాద్ షీ టీం పోలీసులు నిఘా ఉంచారు. బస్ స్టాప్ లు, ముఖ్యమైన ప్రదేశాలలో ఎవరైతే మహిళలు, యువతులు, బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారో వారిపై కేసులు నమోదు చేసి, వీడియోలతో సహా కోర్టులో హాజరుపరుస్తున్నారు షీ టీమ్స్ పోలీసులు.

Hyderabad: పోకిరీల వేటలో.. షీ టీమ్స్
X

దిశ, వెబ్ డెస్క్: సిటీలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీలపై హైదరాబాద్ షీ టీం పోలీసులు నిఘా ఉంచారు. బస్ స్టాప్ లు, ముఖ్యమైన ప్రదేశాలలో ఎవరైతే మహిళలు, యువతులు, బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారో వారిపై కేసులు నమోదు చేసి, వీడియోలతో సహా కోర్టులో హాజరుపరుస్తున్నారు షీ టీమ్స్ పోలీసులు.రద్దీగా ఉండే ప్రదేశాలలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, చిన్న పిల్లలపై వెకిలి చేష్టలు, అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో నిఘాను పెంచారు.

తాజాగా హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన బోనాల జాతర సందర్భంగా.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేశారు షీ టీమ్స్. ఇప్పటివరకు సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో 115 కేసులు నమోదయ్యాయి. అంతేకాక నాలుగు ఫోక్సో కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. మరో 22 కేసుల్లోని వ్యక్తులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు పోలీసులు. షీ టీమ్స్ ఫిర్యాదులలో ఎక్కువ కేసులు అత్యాచారం, ఇంకా వివాహం పేరిట మోసం వంటి కేసులే నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story