కన్నవారిని రోడ్డున వదిలేస్తే కఠిన చర్యలు: వీసీ సజ్జనార్

by Ajay Maddhiboyina |

త‌ల్లిదండ్రుల‌ను రోడ్డుపై వ‌దిలేస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వార్నింగ్ ఇచ్చారు. \

కన్నవారిని రోడ్డున వదిలేస్తే కఠిన చర్యలు: వీసీ సజ్జనార్
X

దిశ, వెబ్ డెస్క్: త‌ల్లిదండ్రుల‌ను రోడ్డుపై వ‌దిలేస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వార్నింగ్ ఇచ్చారు. కొంత‌కాలంగా చాలా మంది ఫిర్యాదు దారులు త‌న‌ను క‌లుస్తున్నార‌ని చెప్పారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలేస్తున్నార‌ని అన్నారు. కొన్ని కేసులు చాలా బాధ క‌లిగిస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ఆస్తులు అన్నీ రాయించుకుని త‌మ‌కు చిన్న ఇంట్లో పెట్టార‌ని, ఆస్తులు రాయించుకుని రోడ్డుపై వ‌దిలేశార‌ని ఫిర్యాదులు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. రోజు గ‌డ‌ప‌డం కూడా త‌మ‌కు క‌ష్టం అవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు.

మ‌రికొంద‌రు వృద్ధాశ్ర‌మాల్లో చేర్పించాల‌ని త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌ని తెలిపారు. త‌ల్లిదండ్రుల బాగోగులు చూడ‌టం బిడ్డ‌ల క‌నీసం ధ‌ర్మం అని అన్నారు. మీరు కూడా ఒక‌రోజు వృద్ధులు అవుతార‌ని అప్పుడు మీ పిల్ల‌లు కూడా అలానే ట్రీట్ చేస్తార‌ని అన్నారు. కాబ‌ట్టి వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదని హెచ్చ‌రించారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంద‌ని అన్నారు. దిక్కుతోచని స్థితిలో, తమ గోడు ఎవరూ వినడం లేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీరు ఒంటరి వారు కాదు, మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం అని వ్యాఖ్యానించారు.

Next Story