ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Naga Rani Yarlagadda |

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మాకు దేశంలోని నగరాలు కాదని, ప్రపంచంలోని టోక్యో, న్యూయార్క్, సింగపూర్ లతోనే పోటీ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి 3ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాళేశ్వర్ నీరు లేకుండా 71.86లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినట్టు తెలిపారు. బాసర నుంచి భద్రాచలం టెంపుల్ కారిడార్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Next Story