- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ ఇన్నోవేటివ్ క్యాపిటల్‌గా హైదరాబాద్.. హీరో రానా దగ్గుబాటి
హైదరాబాద్ ప్రపంచ సృజనాత్మక రాజధానిగా ఎదుగుతోందని, ఫిల్మ్, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో దూసుకుపోతోందని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ప్రపంచ సృజనాత్మక రాజధానిగా ఎదుగుతోందని, ఫిల్మ్, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో దూసుకుపోతోందని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2047 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యూత్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అనే అంశంలో జరిగిన సెషన్‌లో ఆయన ప్రసంగించారు. యువత గొప్పగొప్ప కలలు కనాలని వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు. మానసిక ఆరోగ్యం, యువత సామర్థ్యం, దూరదృష్టి గల వ్యవస్థాపకతపై దృష్టి పెట్టాలని కోరారు. తెలంగాణలో ఆవిష్కరణల పర్వం మొదలవుతోందని, మన ఆవిష్కరణల వైపు త్వరలో ప్రపంచం దృష్టి సారిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సెషన్స్ తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వెల్ బీయింగ్ సెషన్‌లో సైకాలజిస్ట్, వ్యవస్థాపకురాలు డాక్టర్ గీత చల్లా ప్రసంగించారు. తెలంగాణ యువత సామర్థ్యాన్ని ఆవిష్కరించడం, భారత్ ఫ్యూచర్ సిటీ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ రైజింగ్ అనే అంశంపైన జరిగిన సెషన్‌లో వీ హబ్ డైరెక్టర్లు సీతా పల్లాచొల్ల, అన్నీ విజయ, ఐఎస్‌బీ నుంచి ప్రసన్న తంత్రి, రానా ప్రసంగించారు.






