- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Revanth Reddy: ఆమ్జెన్ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆమ్జెన్ సంస్థ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రముఖ బయోటెక్ సంస్థ ఆమ్జెన్ (AMGEN) హైదరాబాద్ లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది. హైటెక్ సిటీలో ఇవాళ అమ్జెన్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు (CM Revanth Reddy). మంత్రి శ్రీధర్ బాబు, అమ్జెన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, అమ్జెన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ, అమ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆమ్జెన్ కంపెనీ రాకతో బయో సైన్స్ లో హైదరాబాద్ హబ్ గా మారుతుందని.. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యామ్ జెన్ సంస్థ హైదరాబాద్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ట్రిలియన్ డాలర్ డీజీపీ స్టేట్ గా తెలంగాణను మార్చడమే మా విజన్ అన్నారు. ఈ విషయంలో నేను మీకు భరోసా ఇస్తున్నానన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోని గొప్ప నగరాలలో ఒకటిగా అత్యంత వేగంగా అవతరించబోతున్నదన్నారు. ఇందులో మీ అందరిని భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నానని కలిసి భవిష్యత్ ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) మాట్లాడుతూ.. హైదరాబాద్ లో టాలెంట్ పూల్ ను ప్రారంభించామని హైదరాబాద్ ఎన్నోవేషన్ కు హబ్ గా మారుతుందని చెప్పారు. ఉద్యోగులకు స్కిల్, ఆప్ స్కిల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఆమ్జెన్ ఇండియా కొత్త అధ్యాయం ప్రారంభించిందన్నారు.
బయో ఫార్మా రంగంలో ఉద్యోగాలు:
అమ్జెన్ సంస్థ విస్తరణలో భాగంగా 2025 నాటికి 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1600 కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నది. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పెట్టుబడులకు ప్రణాళిక చేస్తోంది. దీంతో బయో ఫార్మా రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. అమ్జెన్ తమ ఔషధాల శ్రేణిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరిస్తుంది. ఏఐ, డేటా సైన్స్ తో డిజిటల్ సామర్థ్యాలను ఈ కొత్త సైట్ అందిస్తుంది.






