ప్రపంచ వేగవంతమైన నగరాల్లో హైదరాబాద్ టాప్-4, ఆక్స్ ఫర్డ్ ఎకానమిక్స్ సర్వేలో కీలక విషయాలు

by Ramesh Naini |

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.

ప్రపంచ వేగవంతమైన నగరాల్లో హైదరాబాద్ టాప్-4, ఆక్స్ ఫర్డ్ ఎకానమిక్స్ సర్వేలో కీలక విషయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో (Hyderabad) హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆక్స్ ఫర్డ్ ఎకానమిక్స్ (Oxford Economics) సర్వే ప్రకారం ఈ ర్యాంకు దక్కింది. ఈ సర్వేలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ పదో స్థానంలో చోటు సాధించింది. అయితే, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు 120 గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలంగా ఉందని, ముందుకొచ్చే సంస్థలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే.

భారతదేశంలో పది నగరాలు..

ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పది నగరాలు భారతదేశంలో ఉన్నాయి. వీటిని జీడీపీ-2018-2035 ఆధారంగా ర్యాంకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ జీడీపీ 2018లో 50.6బిలియన్ డాలర్లు ఉండగా 2035 లో జీడీపీ 201.4బిలియన్ డాలర్లు ఉండబోతుందని అంచనా వేశారు.

Next Story