HYD: హాస్టల్ వాష్‌రూమ్‌లో యువతి ప్రసవం

by Prasad Jukanti |

హాస్టల్ వాష్ రూల్ లో ఓ యువతి ప్రసవించడం కలకలం రేపింది. ఈ గర్భానికి ఆ యువతి బావే కారణంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.

HYD: హాస్టల్ వాష్‌రూమ్‌లో యువతి ప్రసవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ హాస్టల్ వాష్‌రూమ్‌లో యువతి ప్రసవించడం కలకలం రేపింది. ప్రసవించిన అనంతరం వెంటిలేటర్ నుంచి బయటకు విసిరివేయడంతో పుట్టిన నవజాత శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర రక్తస్రావమైన యువతి ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నవజాత శిశువు మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది స్పందిస్తూ సదరు యువతి గర్భం దాల్చిన విషయం తమకు తెలియదని చెప్పారు. అయితే యువతి తన బావ కారణంగా గర్భం దాల్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story