HYD: ఫేక్ స్వీట్ల తయారీ గుట్టురట్టు

by Disha Web Desk 4 |
HYD: ఫేక్ స్వీట్ల తయారీ గుట్టురట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లాల్ దర్వాజ ఏరియాలో నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టయింది. ఓ ఇంట్లో నిర్వాహకులు ఫేక్ స్వీట్లు తయారు చేస్తున్నారు. నిర్వాహకులు రాజస్థాన్ నుంచి తెలంగాణకు మిల్క్ పౌడర్ తీసుకువస్తున్నారు. మిల్క్ పౌడర్ లో కెమికల్స్ కలిపి స్వీట్లను తయారు చేస్తున్నారు. భోళా శంకర్ గుట్టు రట్టు చేశారు. చీప్ గా వచ్చే మిల్క్ పౌడర్ తో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో ఈ నకిలీ దందా బయటపడింది. పాల స్థానంలో చీప్ క్వాలిటీ పాల పౌడర్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. స్వీట్ల నకిలీ తయారీ దందాలో లింకులపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed