- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : షటిల్ ఆడుతూ కుప్పకూలి వ్యక్తి మృతి
by Sathputhe Rajesh |
షటిల్ ఆడుతూ కుప్పకూలి వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: షటిల్ ఆడుతూ కుప్పకూలి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధి లాలాగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. లాలాపేట్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ మల్కాజ్ గిరికి చెందిన పరమేష్ యాదవ్(39) కుప్పకూలి మృతి చెందాడు. అక్కడున్నవారు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఇటీవల జిమ్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మరణించగా, నిర్మల్ జిల్లాలో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు మరణించాడు. వరుస ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
Next Story






