- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : భార్యను కిరాతకంగా చంపిన భర్త.. కారణమిదే..!
by Sathputhe Rajesh |
హైదరాబాద్ మీర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో హస్తినాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో హస్తినాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యను భర్త తలపై ఇనుపరాడ్డుతో కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. అయితే భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రాజు అగ్రికల్చర్ కాలనీలోని ఉషోదయ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకుని హత్య చేసిన అనంతరం పీఎస్‌కు నేరుగా వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






