- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : కానిస్టేబుల్‌ను తొక్కుకుంటూ దూసుకెళ్లిన కారు (వీడియో)
చిలకల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: చిలకల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై నుంచి ఓ కారు తొక్కుకుంటూ దూసుకెళ్లింది. ఈ నెల 18న ఘటన జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్ తొలుత ఓ ద్విచక్ర వాహనం స్పీడ్‌గా రావడంతో సైడ్ ఇచ్చాడు. బైక్ వెనక స్పీడ్‌గా వస్తున్న కారును ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించగా కారు వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






