- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్: 103 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్‌తో పోలీసుల ఎదుట 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు...

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్(Operation Kagar) ఎఫెక్ట్.. మావోయిస్టుల(Maoists)పై భారీగా పడింది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నారు. కనిపిస్తే ఎన్ కౌంటర్ చేస్తున్నారు. మరోవైపు జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు. దీంతో పలువురు మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయారు. మావోయిస్టు దళాల్లో కీలకంగా వ్యవహరించిన వాళ్లు సైతం పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ప్రస్తుతం ఈ లొంగుబాటు(Surrender) పరంపర కొనసాగుతోంది.
తాజాగా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్(Bijapur) పోలీసుల ఎదుట103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో తాము లొంగిపోయినట్లు తెలిపారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులందరికీ పునరావాసాలు కల్పిస్తామని పోలీసులు తెలిపారు.






