- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు భారీ నష్టం సంభవించే ప్రమాదం: HRC కీలక ఆదేశాలు
రైతుల జీవనోపాధిని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల జీవనోపాధిని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా ఘనాపూర్ ఆనకట్ట పరిధిలో సుమారు 20 వేల ఎకరాల్లో సాగులో ఉన్న వరి పంటకు సాగునీరు విడుదల చేయడంలో జాప్యం జరగడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. డా.జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఉన్న కమిషన్ మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పంట కీలక దశలో ఉండగా నీటి కొరత కారణంగా భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉన్నదని కమిషన్ అభిప్రాయపడింది.
సాగునీరు అందకపోవడం రైతుల జీవనోపాధి, గౌరవప్రద జీవనం, ఆహార భద్రత వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఉన్న హక్కులకు విరుద్ధమని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. సింగూర్ ప్రాజెక్టు నుంచి వనదుర్గ ప్రాజెక్టు (ఘనాపూర్ ఆనకట్టు)కు 0.30 టీఎంసీల నీటిని 12 రోజులపాటు తక్షణమే విడుదల చేయాలని సూచించింది.






