- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saraswati Pushkaralu : కాళేశ్వరంలో భారీ ట్రాఫిక్ జాం.. 15 కిమీల మేర నిలిచిన వాహనాలు
కాళేశ్వరం(Kaleswaram)లో మే 22 నుండి జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు(Saraswati Pushkaralu) జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం(Kaleswaram)లో మే 22 నుండి జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు(Saraswati Pushkaralu) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుష్కరాలు రెపతితో ముగుస్తుండటంతో భక్తులు భారీగా కాళేశ్వరానికి పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో మహాదేవపూర్- కాళేశ్వరం రూట్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్(Heavy Traffic Jam) ఏర్పడింది. కాళేశ్వరం రూట్‌ను వన్-వే మార్గంగా మార్చడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి పోలీసులు తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయంతో భక్తులు 5 గంటలకు పైగా అడవి ప్రాంతంలో చిక్కుకుపోయి, ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వాహనాల రద్దీ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఇది భక్తులను మరింత గందరగోళంలో పడేయడమే కాకుండా తీవ్ర అసౌకర్యం కలిగించింది. అడవిలోకి మళ్లించిన ట్రాఫిక్ వల్ల రోడ్లు ఇరుకుగా ఉండటం, లైటింగ్ లేకపోవడం, గూగుల్ మ్యాప్‌లలో సరైన రూట్ సమాచారం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.






