- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్..కారణం ఇదే
హైదరాబాద్ మహా నగరంలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మంగళవారం సాయంత్రం నుంచి ఇంకా ట్రాఫిక్ కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఇంకా ట్రాఫిక్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ఐటీ కారిడార్లలో వడగండ్ల వాన పడింది. అయితే సాయంత్రం పూట వర్షం కురిసిన నేపథ్యంలో ఈ ఐటీ కారిడార్లలో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది.
రోడ్లపై నీరు చేరడం కారణంగా వాహనాల రాకపోకలు చాలా నెమ్మదించాయి. ఈ ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటు యుద్ధం కారణంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందని వచ్చిన వదంతుల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. దీంతో రోడ్లపై రద్దీ మరింత పెరిగిపోయింది. ఇంధనం కొరత వార్తలు కేవలం వదంతులేనని, ఆందోళన చెందకూడదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కడుతున్నారు జనాలు.






