ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-21 14:56:12  IST  )

బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి భారీ ఊరట లభించింది.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి భారీ ఊరట లభించింది. 14 రోజుల రిమాండ్‌ను ఖాజీపేట రైల్వేకోర్టు(Kazipet Railway Court) తిరస్కరించింది. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల హుజురాబాద్‌కు చెందిన ఓ గ్రానైట్‌ వ్యాపారిని కౌశిక్ రెడ్డి బెదిరించాడు. రూ.50లక్షలు ఇవ్వాలని అతన్ని డిమాండ్ చేశారు. దిక్కుతోచని స్థితిలో ఆ బాధితుడు సుబేదార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ 21వ తేదీన కౌషిక్ రెడ్డిపై 308(2), 308(4), 308(5) 352 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య కాజీపేటలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు ముందు రిమాండ్ విధించి.. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Next Story