- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు భారీ ఊరట: ఆ కేసులు కొట్టివేసిన హైకోర్టు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా 2011 మార్చి 10న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరించి 'మిలియన్ మార్చ్' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న ఆరోపణలతో అప్పట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై విచారణ జరిపిన హైకోర్టు, రాజకీయ కారణాలతో, ఉద్యమ సమయంలో నమోదైన ఈ కేసులను కొనసాగించాల్సిన అవసరం లేదని భావిస్తూ వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సుదీర్ఘ ఊరట..
ఎన్నో ఏళ్లుగా విచారణ దశలో ఉన్న ఈ కేసుల నుంచి ఇప్పుడు విముక్తి లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగించిన ప్రజాస్వామిక పోరాటంలో భాగంగానే తాము మిలియన్ మార్చ్‌లో పాల్గొన్నామని, ఆ సమయంలో నమోదైన కేసులు అక్రమమని నేతలు వాదిస్తూ వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ తీర్పు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలపై ఉన్న పాత ఉద్యమ కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్న క్రమంలో, కోర్టు నేరుగా ఈ కేసులను కొట్టివేయడం గమనార్హం.






