ఆపరేషన్ సిందూర్‌కు మద్ధతుగా ఇవాళ భారీ ర్యాలీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

by Yella Dhawani Reddy |

పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే

ఆపరేషన్ సిందూర్‌కు మద్ధతుగా ఇవాళ భారీ ర్యాలీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు మద్ధతుగా ఇవాళ సాయంత్రం 6 గంటలు భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ (Telangana Jagruti) ప్రకటించింది. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వం వహించనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ సిందూర్‌ను ప్రతి ఒక్కరూ బలపరచాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదంపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి ప్రజలంతా దన్నుగా నిలవాలని తెలంగాణ జాగృతి సంస్థ విజ్ఞప్తి చేసింది. అందులో భాగంగా భారత సైన్యానికి మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది.

Next Story