- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైర్‌లెస్ సిటీగా హైదరాబాద్.. అండర్‌గ్రౌండ్ కేబులింగ్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్ నగరంలోని ప్రధాన మెట్రో జోన్లలో ఉన్న పై ఎలక్ట్రిక్ లైన్లను పూర్తిగా అండర్‌గ్రౌండ్ కేబులింగ్‌కు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును ఆమోదించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వైర్‌లెస్ సిటీగా హైదరాబాద్ మారనుంది. నగరంలోని ప్రధాన మెట్రో జోన్లలో ఉన్న పై ఎలక్ట్రిక్ లైన్లను పూర్తిగా అండర్‌గ్రౌండ్ కేబులింగ్‌కు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు రూ.4,051 కోట్లుగా నిర్ధారిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సర్కిళ్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాయి. TGSPDCL రూపొందించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ప్రకారం మొత్తం 3,899 కి.మీ నిడివి గల 33kV, 11kV, LT లైన్లు అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌గా మారనున్నాయి. దీంతో నగరంలో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయత పెరగడంతో పాటు నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గనున్నాయని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నగరంలో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా, నిరంతరంగా అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో సంభవించే లోపాలు, ప్రమాదాలు, నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశముంది.






