క్రికెటర్‌ గొంగడి త్రిషకు HCA నజరానా

by Gantepaka Srikanth |

మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌(Women's Under-19 World Cup)లో సత్తా చాటిన క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha)కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) నజరానా ప్రకటించింది.

క్రికెటర్‌ గొంగడి త్రిషకు HCA నజరానా
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌(Women's Under-19 World Cup)లో సత్తా చాటిన క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha)కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) నజరానా ప్రకటించింది. త్రిషకు రూ.10 లక్షలు, ఆమె హెడ్ కోచ్‌కు రూ.5 లక్షలు, ట్రైనర్ శాలినికి రూ.5 లక్షల నజరానా ప్రకటించినట్లు బుధవారం స్పష్టం చేశారు. మరోవైపు ఆమెను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అభినందించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆమె సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా త్రిషను శాలువాతో సీఎం సత్కరించారు. ఆమెకు రూ.కోటి నజరానా ప్రకటించారు.

భవిష్యత్తులో దేశం తరపున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో ఆరంభం నుంచి త్రిష అదరగొట్టింది. ఇటు బ్యాటుతో, అటు బంతితో చెలరేగింది. ఫైనల్లో (44 నాటౌట్‌; 33 బంతుల్లో 8×4) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. 309 పరుగులతో టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలవడమే కాక.. 7 వికెట్లు కూడా తీసిన త్రిష (Gongadi Trisha)నే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు కూడా వరించింది.

Next Story