- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Onions : హైదరాబాద్‌కు భారీగా ఉల్లి దిగుమతి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరానికి ఉల్లి(Onions) పోటెత్తింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరానికి ఉల్లి(Onions) పోటెత్తింది. మునెప్పుడూ లేని విధంగా నగరానికి భారీగా ఉల్లి దిగుమతి(Imports) జరిగింది. ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్ అయిన ఏప్రిల్, మేలో పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి కావడం సహజమే. అయితే ఈసారి జూన్ నెలలో కూడా భారీగా ఉల్లి దిగుమతులు జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ లోని మలక్ పేట వ్యవసాయ మార్కెట్ కు 141 లారీల ఉల్లి దిగుమతి జరిగినట్టు అధికారులు తెలిపారు.
అయితే అందులో 105 లారీల ఉల్లి ఒక్క మహారాష్ట్ర నుంచి దిగుమతి కావడం గమనార్హం. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 43 వేల ఉల్లి బస్తాలు నగరానికి చేరాయి. కాగా ఈ దిగుమతి అయిన ఉల్లి క్వింటాలుకు రూ.1500 నుంచి 1800గా పలుకుతోంది. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం అంతకు డబుల్ రేట్లు పెట్టి కొనాల్సి వస్తుందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.






