- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే చివరి రోజు.. గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డేకు భారీ సంఖ్యలో సందర్శకులు
మర్జింగ్ టెక్నాలజీస్ అనే థీమ్‌తో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు మూడో రోజు శుక్రవారం వేలాది మందితో కిటకిటలాడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే థీమ్‌తో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు మూడో రోజు శుక్రవారం వేలాది మందితో కిటకిటలాడింది. రియల్ లైఫ్‌లో రిజిలియెన్స్ అనే అంశంపై ప్రారంభమైన నేటి సెషన్ కు నగరంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు హాజరై చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో, వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తి పరంగా ఎదురయ్యే ఒత్తిడులు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సిద్ధత, యువతలో గ్రోత్ మైండ్‌సెట్, సమస్య పరిష్కార దృష్టికోణాన్ని అభివృద్ధి చేయడం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ సదస్సులో యూఐడీఏఐ మాజీ చైర్మన్ జి. సత్యనారాయణ, మాజీ ఐఏఎస్ జితేంద్ర పుచ్చ, మాస్టెక్ డిజిటల్ చీఫ్ డెలివరీ ఆఫీసర్ శ్రీనివాస్ ఆత్రేయ, సీటీవో, అవికా కిషోర్ ఉప్పలపాటి, క్విలిస్ సీఈఓలు పాల్గొన్నారు.
ఈ సెషన్‌లో ముఖ్యంగా ఆకర్షణీయమైన అంశం విద్యార్థులు పాల్గొనడం. వేలాది మంది మధ్య జరిగిన ఈ చర్చలో విద్యార్థులు ఎంతో చురుకుగా ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండ్ క్రాఫ్ట్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ చెదనలో ఉపయోగించే పలు అధునాతన పరికరాలు, డ్రోన్ , రోబో తదితర 27 కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు.
ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కాగా, రేపు చివరి రోజైన శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ గ్లోబల్ సదస్సును సందర్శించవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నాడు అగ్రికల్చర్, రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ , ఫార్మర్స్ రైసింగ్ అనే అంశంపై సదస్సు జరుగుతుందని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఈ రోజు కార్యక్రమానికి దాదాపు ఆరువేలకు పైగా హాజరు కాగా వీరిలో ఐదు వేల మంది విద్యార్థులు,1000 మంది ప్రజలు పాల్గొన్నారు.






