- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా డ్రైవర్ పోస్టులకు పోటెత్తిన యువత
by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లోని హైడ్రా సంస్థ ప్రకటించిన డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని హైడ్రా సంస్థ ప్రకటించిన డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉద్యోగాలు హైడ్రా ఆధ్వర్యంలోని వివిధ విభాగాలలో 200 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులన్నీ విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ వంటి విభాగాలకు చెందిన వాహనాలు నడపడానికి సంబంధించినవిగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత డ్రైవింగ్ అనుభవంతోపాటు 2022-2023లో స్వల్ప మార్కులతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరమైన అభ్యర్థులు మాత్రమే అర్హులుగా హైడ్రా పేర్కొంది. అందులో భాగంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికలో పేర్లు ఉన్నవారి దరఖాస్తులు మాత్రమే సిబ్బంది స్వీకరించారు. కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు.
Next Story






