- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబరాబాద్‌లో భారీ భూ కుంభకోణం.. పరారీలో ఏపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు..!
హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని గండిపేటలో భారీ భూ కుంభకోణం కలకలం రేపింది. ఏకంగా రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ జీఓలతో హస్తగతం చేసుకునేందుకు జరిగిన పెద్ద స్కెచ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని గండిపేటలో భారీ భూ కుంభకోణం కలకలం రేపింది. ఏకంగా రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ జీఓలతో (Fake GOs) హస్తగతం చేసుకునేందుకు జరిగిన పెద్ద స్కెచ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మెగా స్కామ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఫేక్ జీఓలతో స్కెచ్.. ముగ్గురి అరెస్ట్
ప్రభుత్వానికి చెందిన విలువైన భూమిని కొట్టేసేందుకు నిందితులు పక్కా ప్లాన్ వేశారు. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను సృష్టించి, ఆ భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు.. భూ దందాలో కీలక పాత్ర పోషించిన నిమ్మల రాజేష్‌గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరి వెనుక ఉన్న మరికొందరు సూత్రధారుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లాపై కేసు
ఈ రూ.1,500 కోట్ల భూ దందాతో వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అలాగే బొల్లా రమేష్‌లకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాల సృష్టి, ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం కేసులో వీరిద్దరిపై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో సైబరాబాద్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.






