నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. గ్రూప్ 1,2,3,4 పరీక్ష తేదీలు ఖరారు..!

by Disha Web Desk 19 |
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. గ్రూప్ 1,2,3,4 పరీక్ష తేదీలు ఖరారు..!
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు టీ- కాంగ్రెస్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ఇవాళ విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చింది. ప్రభుత్వ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్.. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్ష నిర్వహణ తేదీలను కూడా ప్రకటించింది. గ్రూప్ -1 నోటిఫికేషన్ ఒక్కసారి వేయనుండగా.. గ్రూప్-2, 3, 4 నోటిఫికేషన్లు రెండు విడతలుగా వేస్తామని ప్రకటించారు. గ్రూప్స్‌తో పాటుగా 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీన, డిసెంబర్ 15వ తేదీన కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ జాబ్‌ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చింది.

ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడే తేదీలు:

= గ్రూపు-1 ఉద్యోగాల కోసం 2024 ఫిబ్రవరి 1న

= గ్రూపు-2 2024 ఏప్రిల్ 1న

= గ్రూపు-3 నోటిఫికేషన్ జూన్1, డిసెంబరు 1న

= గ్రూపు-4 నోటిఫికేషన్ జూన్ 1, డిసెంబరు 1న

Next Story

Most Viewed