- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిగ్ వర్కర్లకు భారీ గుడ్ న్యూస్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ల (Gig Workers)కు మంత్రి వివేక్ వెంకట స్వామి (Vivek Venkata Swamy) తీపి కబురు చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ల (Gig Workers)కు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి (Vivek Venkata Swamy) తీపి కబురు చెప్పారు. త్వరలోనే గిగ్ వర్కర్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తోందని అన్నారు. ఎన్నికల ముందు వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టం తేస్తామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రాజస్థాన్ (Rajastan), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో ఇప్పటికే గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించారని గుర్తు చేశారు. త్వరలో తెలంగాణ (Telangana)లో కూడా అదే చేయబోతున్నాయని స్పష్టం చేశారు.
గిగ్ వర్కర్ల హక్కుల అమలు కోసం ఇప్పటి వరకు 66 సలహాలు, సూచనలు వచ్చాయని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తొలి అడుగు వేయబోతోందని.. గిగ్ వర్కర్లకు సంబంధించి కొత్త చట్టాన్ని కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నామని అన్నారు. మంత్రివర్గంలో ఆమోదం పొందాక అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని అన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కొత్త చట్టంతో మొత్తం 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. కొత్త యాక్ట్‌లో భాగంగా 2 శాతం సెస్ వినియోగదారులు లేదా కంపెనీ యాజమాన్యం భరించాలనే ప్రతిపాదనను బిల్లును పొందుపరుస్తామని మంత్రి వివేక్ అన్నారు.






