- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో భారీ శబ్దంతో పేలుడు
by GSrikanth |
హైదరాబాద్‌లో భారీ శబ్దంతో సంభవించిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడలో ఓ కెమికల్ డబ్బా పేలడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో భారీ శబ్దంతో సంభవించిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడలో ఓ కెమికల్ డబ్బా పేలడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం షకీల్ అనే వ్యక్తి బండ్లగూడ ప్రాంతంలో చెత్తను సేకరిస్తుండగా అతడికి ఓ కెమికల్ డబ్బా కనిపించింది. ఆ డబ్బాను ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో షకీల్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన షకీల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అసలేం జరిగింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






