గిన్నిస్ రికార్డు కైవసం.. గ్లోబల్ సమ్మిట్‎లో భారీ డ్రోన్ షో

by Ramesh Naini |   (  Updated:2025-12-09 15:50:43  IST  )

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గిన్నిస్ రికార్డు కైవసం.. గ్లోబల్ సమ్మిట్‎లో  భారీ డ్రోన్ షో
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ సమ్మిట్‌లో భాగంగా అన్ని సెషన్లు ముగిశాయి. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా “Telangana is Rising – Come, Join the Rise” అనే థీమ్‌తో భారీ డ్రోన్ షో అట్టహాసంగా నిర్వహించారు. ఈ డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఫైర్ వర్క్స్ (బాణసంచా ప్రదర్శన) సైతం ఆకట్టుకుంది. అయితే ఈ భారీ డ్రోన్ షో గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ధృవ పత్రం అందజేశారు. మూడువేల డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శనకు గిన్నిస్ బుక్ రికార్డు పొందింది.

Next Story