- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: భారీగా మున్సిపాలిటీల్లో హంగ్.. రసవత్తరంగా క్యాంపు రాజకీయాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 29 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతోచైర్మన్ పీఠం కోసం ప్రధాన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొనగా పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో (Telangana Municipal Elections 2026) చాలా చోట్ల హంగ్ పరిస్థితులు (Hung Municipalities) కనిపిస్తున్నాయి. దాదాపు 28 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ప్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో ఎలాగైన మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు కోట్ల స్వతంత్ర అభ్యర్థులను క్యాంపులకు తరలించే ప్రయత్నం చేయగా ప్రత్యర్థులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక స్వతంత్రుల్లో చాలా మంది మద్దతు ఇవ్వాలంటే చైర్మన్ పీఠం తమకే ఇవ్వాలని పట్టుబడుతుండటంతో మున్సిపల్ రాజకీయం మరింత రంజుగా మారింది.
ఇప్పటి వరకు హంగ్ మన్సిపాలిటీలు ఇవే:
జహీరాబాద్, కోహీర్, ఇస్నాపూర్, జిన్నారం, కామారెడ్డి, జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్, జమ్మికుంట, వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజన్ నగర్, బెల్లంపల్లి, కేతన్ పల్లి, మొయినాబాద్, అలియాబాద్, ఎల్లంపేట, బోధన్, మెదక్, నర్సాపూర్, అలంపూర్, గద్వాల, అమరచింత, భైంసా, మెట్టుపల్లి, పోచంపల్లిలో హంగ్ ఏర్పడ్డాయి.






