- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సులకు పెరిగిన భారీ డిమాండ్
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఓ ప్రయివేట్ ట్రావెల్ బస్సు, ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొనడం వల్ల, నిప్పులు చెలరేగి ఆయిల్ ట్యాంకుకు అంటుకొని, క్షణాల్లో బస్సు మంటల్లో చిక్కుకొని, అందులోని ప్రయాణికుల్లో 19 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘోర దుర్ఘటన అనంతరం ప్రయివేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు.
ప్రమాదం జరిగిననాటి నుంచి వందలమంది ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఆన్లైన్ రిజర్వేషన్లలో ప్రయివేట్ ట్రావెల్ బస్సుల సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు వెళ్లే 200కు పైగా ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడటమే కాదు, ముందస్తు బుకింగ్స్ అన్నీ నిండిపోయి, అదనపు బస్ సర్వీసులు వేయాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు.
మరోవైపు ఆర్టీఏ అధికారులు ప్రయివేట్ ట్రావెల్ బస్సులపై కొరడా జులిపింస్తోంది. ట్రావెల్ బస్సులు రోడ్డు ఎక్కకముందే అస్సాధికారులు తనిఖీలు చేస్తుండటంతో.. ట్రావెల్ బస్సులు బయటికి తీయడం లేదు. దీంతో గత రెండు రోజులుగా వందలాది ప్రయివేట్ బస్సులు కదలలేదు.






