మానుకోటలో భారీ సైబర్ మోసం.!

by Elthuri vijay kumar |

బిట్ కాయిన్ ట్రేడింగ్.. ఖాతాలో రూ.32,53,447 ఖాళీ

మానుకోటలో భారీ సైబర్ మోసం.!
X

మానుకోటలో భారీ సైబర్ మోసం.!

-బిట్ కాయిన్ ట్రేడింగ్.. ఖాతాలో రూ.32,53,447 ఖాళీ

-మోసపోయిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు

దిశ,మహబూబాబాద్: మానుకోట పట్టణ కేంద్రంలో భారీ సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిట్ కాయిన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించి ఆశ చూపి ఓ మెడికల్ షాప్ యజమాని నుండి సైబర్ నేరగాళ్లు రూ.32లక్షల53వేల447 స్వాహా చేశారు. మహబూబాబాద్ పట్టణ సీఐ గట్ల మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా మ్యారేజ్ బ్యూరో పేరిట సందేశాన్ని పంపి బురిడీ కొట్టించే ప్రయత్నం చేయగా అది విఫలమవడంతో అదే వాట్సాప్ నెంబర్ నుంచి బిట్ కాయిన్ ట్రేడింగ్ గురించి వివరించి ఇందులో ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి లింక్ పంపించారు. దీంతో ఆయన ఆ లింక్ ద్వారా బిట్ కాయిన్ ట్రేడింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. సైబర్ మోసగాళ్లు చెప్పిన విధంగా మొదట రూ. 50 వేలు, ఆ తర్వాత రూ.ఐదు లక్షలు పంపించారు. బాధితుడి వాలెట్లో రూ.10 లక్షలున్నట్లు చూపించి నమ్మబలికారు. నిజమేనని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా వారు చెప్పిన విధంగా వివిధ బ్యాంకుల ఖాతా నంబర్లకు మొత్తం రూ.32,53,447 పంపించారు. బాధితుడి ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండానే మరింత సొమ్ము అడుగుతుండటంతో అనుమానం వచ్చి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి వెంటనే మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Next Story