- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IT Rides:: పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లల్లో భారీగా బంగారం, ఆస్తుల పత్రాలు స్వాధీనం!
ఈ ఇద్దరి ఇళ్లలో దాదాపు రూ. 20 కోట్ల నగదును ఐటీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు రోజులుగా హైదరాబాద్‍లోని ప్రముఖ రెస్టారెంట్ల ఓనర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి పిస్తా హౌస్(Pista house), షా గౌస్ (shah ghouse), మెహిఫిల్ రెస్టారెంట్ యజమానుల ఇళ్లలో ఇన్‍కమ్ టాక్స్ అధికారులు రెయిడ్స్ (IT Rides) నిర్వహించారు. 30 బృందాలు ఏకకాలంలో 15 చోట్ల జరిపిన దాడుల్లో రెస్టారెంట్ యజమానుల వద్ద పెద్ద మొత్తంలో బంగారం, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పిస్తాహౌజ్, షాగౌస్ హోటల్ యజమానుల ఇళ్లలో దాదాపు రూ.20 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వస్తున్న ఆదాయానికి లెక్కల్లో చూపుతున్న ఆదాయానికి పెద్ద ఎత్తున తేడాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ల ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. ఈ సోదాలకు సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.






