- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను వేగవంతం చేయండి
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్ఆర్డీఏ కోరింది.

- నియామకాల ఆలస్యం వల్ల రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై తీవ్ర ప్రభావం
- డీఎంఈ కి హెచ్ఆర్డిఏ విజ్ఞప్తి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నేరుగా నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం డీఎంఈకి అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. గత సంవత్సరం జూన్ 28న జారీ చేసిన నోటిఫికేషన్ నం. 03/2025 ప్రకారం నియామకాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ ప్రక్రియ పూర్తి కాలేదని హెచ్‌ఆర్‌డీఏ పేర్కొంది. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు అనిశ్చితిలో పడిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆలస్యం ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు డా. కార్తీక్ నాగుల తెలిపారు. ఎంబీబీఎస్ విద్యార్థులు అకాడెమిక్, క్లినికల్ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, సీనియర్ రెసిడెంట్లు సేవలతో పాటు బోధన బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, అభ్యర్థులు, మొత్తం ఆరోగ్య వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని హెచ్‌ఆర్‌డీఏ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.






