క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కౌన్సిల్‌ రద్దు చేయాలి..హెచ్‌ఆర్‌డిఎ డిమాండ్‌

by Ajay Maddhiboyina |

రాష్ట్ర క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీఈఏ కౌన్సిల్) గడువు ముగిసి ఏడాది దాటినా... కొత్త కౌన్సిల్‌ ఏర్పాటు కాలేదని ఫలితంగా వైద్య రంగానికి ఇబ్బందులు తప్పడం లేదని దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెల్త్‌ రెవల్యూషనరీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డిఎ) కోరింది.

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కౌన్సిల్‌ రద్దు చేయాలి..హెచ్‌ఆర్‌డిఎ డిమాండ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీఈఏ కౌన్సిల్) గడువు ముగిసి ఏడాది దాటినా... కొత్త కౌన్సిల్‌ ఏర్పాటు కాలేదని ఫలితంగా వైద్య రంగానికి ఇబ్బందులు తప్పడం లేదని దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెల్త్‌ రెవల్యూషనరీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డిఎ) కోరింది. సీఈఏ కౌన్సిల్లో హాస్పిటల్స్‌కు ప్రతినిథ్యం లేకపోవడంతో పాటు విధానపరమైన సహకారం లేక రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హెచ్‌ఆర్‌డిఎ పేర్కొంది. గడువు ముగిసిన ప్రస్తుత సీఈఏ కౌన్సిల్‌ను తక్షణం రద్దు చేయాలని హెచ్‌ఆర్‌డిఎ డిమాండ్ చేసింది.

సీఈఏ చట్టం ప్రకారం హెచ్‌ఆర్‌డిఎ, ఐఎంఏ, టీజీఎంసీ, థానా, టీజీడీడీఏ వంటి సంస్థలను ప్రతినిధులుగా కలుపుకుని కొత్త, సమగ్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని హెచ్‌ఆర్‌డిఎ డిమాండ్ చేసింది. ఫైర్‌, బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ, మున్సిపల్‌ అనుమతుల కోసం సింగిల్‌ విండో సిస్టమ్‌ అమలు చేయాలని హెచ్‌ఆర్‌డిఎ కోరింది. చిన్న, మధ్య తరహా ఆస్పత్రులను కార్పొరేట్‌ హాస్పిటల్స్‌తో సమానంగా చూడకూడదని... వాటికి ప్రత్యేక ప్రమాణాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీహార్‌, హర్యానా మాదిరిగా 40–50 పడకల కంటే తక్కువ ఉన్న ఆస్పత్రులను పూర్తి సీఈఏ నిబంధనల నుంచి మినహాయించాలని కోరారు. నియంత్రణ పేరుతో ఆస్పత్రులపై ఊపిరాడనంత ఒత్తిడి చేయవద్దన్నారు. రాష్ట్రంలో ప్రజలకూ, వైద్యులకు అనుకూలమైన ఆచరణాత్మక విధానాలు అవసరమని హెచ్‌ఆర్‌డిఎ స్పష్టం చేసింది.

Next Story