Human Rights: పాశమైలారం ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ

by Ramesh Naini |   (  Updated:2025-07-01 11:00:31  IST  )

పాశమైలారం పేలుడు ఘటనపై నేషనల్ హుమన్ రైట్స్ కమిషన్ (NHRC)కి పిర్యాదు చేశారు.

Human Rights: పాశమైలారం ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాశమైలారం (Pashamylaram) పేలుడు ఘటనపై నేషనల్ హుమన్ రైట్స్ కమిషన్ (NHRC)కి పిర్యాదు చేశారు. సిగాచి పరిశ్రమ డైరెక్టర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడ్డ వారికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని రామారావు అందులో తెలిపారు. అలాగే తెలంగాణలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ పాశమైలారం ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) సుమోటోగా తీసుకుంది.

జూలై 30లోగా ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, లేబర్‌ కమిషనర్‌, ఫైర్‌ డీజీ, సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఘటనపై న్యాయవాది కుమారస్వామి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఓల్డ్ మిషనరీ వాడకం, అధికారులు చూసి చూడనటువంటి తీరు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిగాచి కెమికల్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలుగా ఫ్యాక్టరీలకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

Next Story