రామంతాపూర్ ఘటనపై HRC సీరియస్.. TSSPDCL సీఎండీకి నోటీసులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-19 12:00:50  IST  )

హైదరాబాద్‌లోని రామంతాపూర్ ఘటన(Ramanthapur incident)ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(HRC) సుమోటోగా స్వీకరించింది.

రామంతాపూర్ ఘటనపై HRC సీరియస్.. TSSPDCL సీఎండీకి నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్/హైదరాబాద్ బ్యూరో: హైదరాబాద్‌లోని రామంతాపూర్ ఘటన(Ramanthapur incident)ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(HRC) సుమోటోగా స్వీకరించింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను సీరియస్‌గా తీసుకున్నది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంపై ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను సైతం నివేదిక కోరింది. ఈనెల ఆగష్టు 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా, రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రథాన్ని లాగుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Next Story