- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: పాతబస్తీ అగ్ని ప్రమాదంపై HRC సీరియస్.. సీఎస్‌కు నోటీసులు
హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం(Gulzar House Fire Accident)పై మానవ హక్కుల కమిషన్ సీరియస్(HRC) అయింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం(Gulzar House Fire Accident)పై మానవ హక్కుల కమిషన్ సీరియస్(HRC) అయింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర సీపీ, ఫైర్ డీజీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్ 30వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, గుల్జార్‌హౌజ్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. అపస్మారకస్థితికి చేరిన నలుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ విషాదంపై రాష్ట్రప్రతి ముర్ము, ప్రధాని మోడీ, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి.






