రాష్ట్రంలో HPV వ్యాక్సినేషన్ షురూ.. కింగ్ కోఠిలో ప్రారంభించిన మంత్రి దామోదర

by Kema Shiva Kumar |

హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహ అట్టహాసంగా ప్రారంభించారు.

రాష్ట్రంలో HPV వ్యాక్సినేషన్ షురూ.. కింగ్ కోఠిలో ప్రారంభించిన మంత్రి దామోదర
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. శనివారం హైదరాబాద్‌లోని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం రాబోయే మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఈ టీకా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

కాగా, నేటి నుంచి నెల రోజుల పాటు అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (CHCs) ఈ టీకాలు అందుబాటులో ఉండనున్నాయి. మొదటి నెల పూర్తయిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (PHCs) హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తుంది. గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుంచి బాలికలను, మహిళలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైద్య నిపుణులు స్వాగతిస్తున్నారు. అర్హులైన వారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story