- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఎలా.. MLC కవితకు అభిమాని ట్వీట్
దేశ రాజకీయాలపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాలపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా వంటి రాష్ట్రాల నుంచి కీలక నేతలు బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా.. బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలి అంటూ మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ట్విట్టర్ వేదికగా వివరాలు అడిగారు. ఆ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్‌కు మద్దతు పలకాలని సూచించారు. తెలంగాణ మాదిరిగా దేశంలో 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని కవిత తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజానీకం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనం అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాందేడ్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందని చెప్పుకొచ్చారు.
Sagar Ji, you can support our leader and Hon'ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 20, 2023
DM your contact details. We are happy to welcome you 😊 #AbkiBaarKisaanSarkar https://t.co/TnBdaB8r6D






