- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుంది? : హరీశ్‌రావు డిమాండ్
ముందుగా మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముందుగా మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకసారి సీఎం లక్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, అసలు మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుకు తింటారా అని అంటున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కి బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నారు.. మరి మూసీ సుందరీకరణ మీద మాత్రం లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు..? అని ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు?
మూసీ సుందరీకరణలో ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లించారా? లేదా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారా? అని నిలదీశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ. 14 న్నర లక్షల డబ్బు ఇవ్వాలి. వాళ్ల పాత ఇంటికి ఆర్ అండ్ బీ ఎస్టిమేట్ చేసి ఆ డబ్బులు చెల్లించాలన్నారు. అలాగే సేలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలం, ఇల్లు ఇవ్వాలన్నారు. ఇవి ఇచ్చారా? ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు? అని ప్రశ్నించారు.
కూల్చాల్సిన కట్టడాలు ఎన్ని?
ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన కూల్చాల్సిన ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలు ఎన్ని? ఎంత భూమిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు? అని ప్రశ్నించారు. స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసిలో వదులుతామన్నారు. అసలు ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచి ఆ గోదావరి నీళ్లను తెస్తున్నారా? లేక ఎక్కడి నుంచైనా గాలిలో నుంచి తెస్తున్నారా? ఆ రెండున్నర టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, గతంలో చెప్పినట్లుగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని అయినా అడ్డుకుంటామని అన్నారు. ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి.. ఆ ఖాళీ స్థలాల్లో మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని, కానీ, మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read More : మొదట 21 కి.మీ మేర మూసీ పునరుద్ధరణ పనులు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
మూసీ పునరుద్ధరణపై వాడీవేడి చర్చ.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్






