- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరంపై కాశీ మజిలీ కథలు ఇంకెంత కాలం.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ సెటైర్లు
పదేళ్ల కేసీఆర్, 12 ఏళ్ల మోడీ పాలనతో పాటు రెండున్నరేళ్ల తమ పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరంపై కాశీ మజిలీ కథలు ఇంకెంత కాలం చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సెటైర్లు వేశారు. ఇవాళ నగరంలోని శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు ప్రజలు నమ్మారని.. చివరకు బకాసురుడిని బంధించి ఫామ్‌హౌస్‌లో పెట్టారంటూ ఛలోక్తులు విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నష్టాల్లో కొట్టుమిట్టాడిన ఆర్టీసీ నేడు వెయ్యి కోట్ల లాభంతో నడుస్తోందని అన్నారు. సింగరేణి, విద్యుత్ శాఖలో భారీ సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్, 12 ఏళ్ల మోడీ పాలనతో పాటు రెండున్నరేళ్ల తమ పాలనపై అసెంబ్లీలో చర్చ పెడదామని విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు.
బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్...
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి 15 ఏళ్లు పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ మమత కాబట్టి ఊరుకున్నారు.. ఇక్కడ మా వాళ్లు గట్టి సమాధానమే చెబుతారంటూ బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను ఉన్నది ఉన్నట్లుగా చెబుతానని, పదవి శాశ్వతం కాదన్నారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్‌లకే పదవులు శాశ్వతం కాదు.. అబ్బద్దాలు చెప్పి నమ్మించను, ఉన్నదే చెబుతానని సీఎం అన్నారు. ఈ ఏడు వర్షాలు ఉండవని నిపుణులు చెబుతున్నారని, వర్షాలు పడకపోతే ఇబ్బంది ఉంటుందని, అందుకే పంటలను మార్చమని చెబుతున్నాయని తెలిపారు. పంట మార్పిడి చేయమంటే దానిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాపం ఉన్నట్లుగా ఓ కుటుంబం అంతా అబద్ధాలు చెబుతూ రాష్ట్రం మొత్తం తిరుగుతోందని, దోపిడీ లేకుండా పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క పథకం అమలు చేయలేదని ఆరోపించారు. సంసారాన్ని సర్దుకుపోతున్నామని, బజారున పెట్టుకోవద్దని చూస్తున్నామని అన్నారు. వందల మంది త్యాగాలు చేస్తే పదవులు వచ్చాయని, ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది ‘ప్రజాపాలన’ కాదా అని ప్రశ్నించారు. తమను అధికారంలోంచి దిగిపో అంటున్నారని.. ఇదేమన్నా మీ గడీనా అంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.






