- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలిరోజు సర్పంచి పదవులకు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ (గురువారం) తొలి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్‌ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ పదవులకు 3,242 నామపత్రాలు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. వార్డు సభ్యులకు 1,821 నామినేషన్లు, తొలిదశలో 4,236 గ్రామపంచాయతీలు, 37 వేలకుపైగా వార్డుల్లో పోలింగ్ జరగనుంది.
కాగా, తొలి విడతకు సంబంధించి ఈ నెల 29 వరకు నామినేషన్లు దాఖలు అవకాశం ఉంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు విధించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి.. గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నారు.






