- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు ఇయ్యాలి ?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governament) రేషన్ కార్డుల(Ration Cards) కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తులు కోరుతున్న తీరు సహేతుకంగా లేదని..అసలు రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా ? అని..ఇంకెన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governament) రేషన్ కార్డుల(Ration Cards) కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తులు కోరుతున్న తీరు సహేతుకంగా లేదని..అసలు రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా ? అని..ఇంకెన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఒక్క రేషన్ కార్డు కోసం.. ఇంతగనం జనాన్ని పరేషాన్ జేస్తరా ? అని ప్రశ్నించారు.
ఇంకెన్నిసార్లు ఇయ్యాలె.. అప్లికేషన్లు ? ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిండ్రు.. ప్రజాభవన్ కు వచ్చి ఇచ్చిండ్రు..గాంధీభవన్ కు వచ్చి ఇచ్చిండ్రు..గ్రామసభల్లో ఇయ్యమంటే మళ్లీ ఇచ్చిండ్రు..ఇన్నిసార్లు ఇచ్చినంక..మళ్లీ మొత్తం కథ.. మొదటికి తెస్తరా..? అని ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. ఏడాది అయిపాయె..! ఇచ్చిన అప్లికేషన్లు.. చెత్తకుప్పల పాలాయె..!! మళ్లీ కొత్తగా “మీ సేవలో” దరఖాస్తు చెయ్యాల్నా? తమాషా చేస్తున్నరా ? గరీబోళ్లతో ఆటలాడుతున్నరా? అని ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలన అంటే “దరఖాస్తులు, దఫ్తర్లేనా”? .. అసలు ఈ కాంగ్రెసోళ్లకు రేషన్ కార్డుల కోసం పేద జనం తిరిగి తిరిగి బేజారైనా.. సర్కారుకు సిగ్గనిపిస్తలేదా ? అని దుయ్యబట్టారు. రేషన్ కార్డు ఇచ్చే ఉద్దేశం అసలు ప్రభుత్వానికి ఉన్నదా..? లేదా..? చేతకాకపోతే.. చేతులెత్తేసి క్షమాపణ అడుగుండ్రని డిమాండ్ చేశారు. అంతే తప్ప.. అప్లికేషన్లతో ఆగంచేస్తే జనం ఊరుకోరని..కాంగ్రెసోళ్లను ఊరూరా ఉరికిస్తరు..! తస్మాత్ జాగ్రత్త..!! అని కేటీఆర్ హెచ్చరించారు.






