‘వేరొళ్ల పెళ్లిళ్లలో డాన్స్ ఎప్పటి వరకు?’ టీ బీజేపీ నేతలపై రాజాసింగ్ సెటైర్లు

by Ramesh Naini |

అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ ఎన్నికల ఫలితాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

‘వేరొళ్ల పెళ్లిళ్లలో డాన్స్ ఎప్పటి వరకు?’ టీ బీజేపీ నేతలపై రాజాసింగ్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ ఎన్నికల ఫలితాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల ఫలితాలపై ఆయన సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో చాలా మంచిగా బీజేపీ గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ముంచుతారని ఇక్కడి నేతలపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు తీసుకుని వస్తారో? చెప్పండి అని నిలదీశారు. బెంగాల్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకున్నారు.. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరోళ్ళ పెళ్లిళ్లలో పోయి డాన్స్ చేస్తారు చెప్పండని సెటైర్లు వేశారు. ‘బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో అధికారం వస్తుంది.. ఇక్కడ కొందరు నేతలు ఈగోయిజం పక్కన పెట్టాలి. కొందరు నేతలకు సిగ్గు ఉంటే బెంగాల్ గెలుపులో కార్యకర్తల సంకల్పం చూసి తెలుసుకోండి’ అని విమర్శించారు.

Next Story