- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ వాసులకు BIG అలర్ట్.. ఇందిరమ్మ ఇళ్లపై హౌజింగ్ కార్పొరేషన్ కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల కోసం జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో 10.71 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు హౌజింగ్ కార్పొరేషన్(Housing Corporation) స్పష్టం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల కోసం జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో 10.71 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు హౌజింగ్ కార్పొరేషన్(Housing Corporation) స్పష్టం చేసింది. ఇప్పటివరకు 7.50 లక్షల దరఖాస్తులు పరిశీలించినట్లు తెలిపారు. వారం రోజుల్లో మిగిలిన 3.21 లక్షల దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తవుతుందని వెల్లడించారు. సర్వే పూర్తయిన తర్వాతే జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డలు సభలు ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,249 మందితో దరఖాస్తులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. https://indirammaindlu.telangana.gov.in/appicantsearch లో సర్వే వివరాలు పొందుపర్చుతామని వెల్లడించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభలో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.






